TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీలో ఇంటర్ పేపర్ లీక్..

Published on: Fri Mar 3, 2017 10:16AM

కడపలో ఇంటర్మీడియెట్ క్శశ్చన్ పేపర్ లీక్ అయినట్లు వస్తున్న వార్తలు కలకలం రేపుతున్నాయి. నగరంలోని ఓ పరీక్షా కేంద్రం నుంచి ఇంగ్లీష్ సెట్-3 పేపర్ లీక్ అయ్యిందని కొందరు విద్యార్థులకు వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాలకు సందేశాలు వచ్చాయి. అయితే అది ప్రస్తుత ప్రశ్నాపత్రామా..? గత ఏడాది పేపరా..? అనేది పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇవాళ జరిగే ఇంటర్ పరీక్షకు సెట్-1 ప్రశ్నాపత్రాన్ని అధికారులు ఎంపిక చేసినట్లు తెలిసింది.  మరోవైపు ఈ లీకేజ్ విషయం తన దాకా వచ్చిందని ఆర్ఐవో తెలిపారు..ప్రస్తుతం పేపర్ ఏ కళాశాల నుంచి బయటకు వచ్చిందో తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.