తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు
Published on: Wed Mar 1, 2017 9:20AM

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇవాళ్టీ నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. తెలంగాణలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షకు సెట్ సీ ప్రశ్నాపత్రం, ఏపీలో మొదటి సంవత్సరం సెకండ్ లాంగ్వేజ్ పరీక్షకు సెట్-3 ప్రశ్నాపత్రం ఎంపిక చేశారు. అలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు.


