బండి బగీరథకు మధ్యంతర బెయిలు
Published on: Sun Jun 21, 2026 8:22AM

ఫోక్సో కేసులో అరెస్టై జైలులో ఉన్న బండి భగీరథకు మల్కాజ్‌గిరి కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇంజినీరింగ్ పరీక్షలకు హాజరయ్యేందుకు మధ్యంతర బెయిలు మంజూరు చేయాలని కోరుతూ భగీరథ తరఫు న్యాయవాదులు కోర్టును ఆశ్రయించారు.
ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు, విద్యార్థి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పరీక్షలు రాసేందుకు అవకాశం కల్పిస్తూ.. ఈ నెల 26వ తేదీ వరకు మధ్యం తర బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
కోర్టు ఆదేశాల మేరకు బండి భగీరథ జైలు నుంచి మధ్యంతర బెయిల్ పై విడుదలయ్యారు. అయితే, మధ్యంతర బెయిల్ గడువు ముగిసే లోపు రెగ్యులర్ బెయిల్ లేదా మధ్యంతర బెయిల్ పొడిగింపు లభించకపోతే, కోర్టు ఆదేశాల ప్రకారం తిరిగి జైలు అధికారుల ఎదుట లొంగిపోవాల్సి ఉంటుంది.


