TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మహిళలకు వడ్డీ మాఫీతో ప్రభుత్వానికి అదనపుభారం?

Published on: Tue Aug 21, 2012 8:44AM

ఇకపై రాష్ట్రంలోని మహిళా సంఘాలు వడ్డీ లేని రుణాలు అనుభవించనున్నాయి. దీని వల్ల ప్రభుత్వానికి అదనపుభారం పడినా సిద్ధమేనని సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. ఐదులక్షల రూపాయలు బ్యాంకు రుణం తీసుకుంటే ఇప్పటి వరకూ మహిళా సంఘాలు వడ్డీ కింద మూడులక్షల 70వేల రూపాయలు 60నెలల్లో చెల్లించేవి. ఇప్పుడు ఆ వడ్డీ భారం ప్రభుత్వమే భరిస్తుందని సిఎం హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని కోటి 40లక్షల మంది మహిళాసంఘాల్లో ఉన్నారు. ఇప్పటికే బ్యాంకర్లు, ప్రభుత్వం రూ.13వేల కోట్ల రూపాయలు మహిళా సంఘాలకు రుణాలుగా ఇచ్చేందుకు లక్ష్యంగా నిర్ణయించుకున్నాయి. ప్రభుత్వంపై 14శాతం వడ్డీభారం పడుతోందని సిఎం తెలిపారు.

 

రాష్ట్రంలో మహిళలు ఆర్థికంగా ఎదగాలన్న లక్ష్యంతోనే తాము ఈ భారం మోస్తున్నామని మహిళలు గుర్తిస్తే చాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక్కసారిగా రాష్ట్రప్రభుత్వం వడ్డీభారం తలకెత్తుకోవటానికి సిఎం ఇందిరమ్మబాట కార్యక్రమమే దోహదపడిరదని మహిళలు భావిస్తున్నారు. మహిళా సంఘాలు చేస్తున్న కార్యక్రమాలను పరిశీలించాకే సిఎం ఈ నిర్ణయం తీసుకున్నారని పలు సంఘాల నేతలు అభిప్రాయ పడుతున్నారు. అంతేకాకుండా రాష్ట్ర జనాభాలో కీలకమైన (దాదాపు 50శాతం) మహిళలను ప్రభుత్వం ఆకట్టుకుంటే భవిష్యత్తులో వారి మద్దతు కాంగ్రెస్‌పార్టీకి ఉంటుందన్న నమ్మకంతోనే సిఎం ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రభుత్వ ఆర్థికశాఖ మాత్రం మహిళాసంఘాల రుణాల వల్ల తమపై పడే భారాన్ని లెక్కిస్తున్నాయి. రంజాన్‌కానుకగా సిఎం ప్రకటించిన వరం అదనపుభారం అని శాఖ అభిప్రాయపడుతోంది.