సీతమ్మ చీర స్పెషాలిటీ ఇదే.. తెలుసుకోవాల్సిందే...
Published on: Tue Feb 1, 2022 4:03PM
మహిళలు-చీరలు. ఈ రెండింటి బంధం మామూలుది కాదు. అది సాధారణ గృహిణి అయినా.. కేంద్ర మంత్రి అయినా.. చీరల విషయంలో ప్రత్యేకతను కనబరుస్తారు. సంపన్నులు, ప్రముఖులు డిజైనర్ సారీస్‌తో రిచ్ లుక్‌తో కనిపిస్తుంటారు. ఇక, మామూలు మహిళలైతే ఉన్నంతలో హుందాగా ఉండే ప్రయత్నం చేస్తుంటారు. అలానే, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సైతం చీరలో తనదైన ప్రత్యేకతను చాటుతుంటారు. ఎల్లప్పుడూ నిరాడంబరంగానే ఉంటారు. సింపుల్‌గా రెడీ అవుతుంటారు. ఆమె చీరల ఎంపిక సైతం సాదాసీదాగానే ఉంటుంది.
ఇక బడ్జెట్ లాంటి స్పెషల్ ఈవెంట్స్‌కు సైతం మంత్రి నిర్మలా సీతారామన్ అదే సింప్లిసిటీ కనబరిచారని అంటారు. ఆమె ధరించిన చీర వివరాలు అప్పుడే సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి. చేనేత చీరలను ఇష్టపడే సీతమ్మ.. ఈసారి పార్లమెంట్ బడ్జెట్ సమావేశానికి ఒడిశా చేనేత చీరను ధరించారు.
నిర్మలా సీతారామన్ ధరించిన రస్ట్ బ్రౌన్, డార్క్ మెరూన్ కలగలిసిన చీరకు ఆఫ్ వైట్ నేత బోర్డర్ మరింత ఆకర్షణీయతను తీసుకొచ్చింది. నిర్మలా సారీ డిటైల్స్‌పై నెట్‌లో పెద్ద ఎత్తున సర్ఫింగ్ చేస్తున్నారు నెటిజన్స్.


