TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అయి పాయె.. అక్కడా పరవు పాయె...

Published on: Mon Feb 21, 2022 5:57PM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసేఆర్ ముంబై పర్యటన తెలంగాణ లోనే కాదు, అటు మహారాష్ట్రలో కూడా నవ్వులు పూయిస్తోంది. తెలంగాణలో అయితే, స్వయంగా కేసీర్, తెరాస నాయకులు దేశోద్ధారణ కోసమే కేసీఆర్ జన్మించారని, దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు, కలియుగంలో పుట్టిన శ్రీ కృష్ణ భగవానుడే శ్రీ కేసీఆర్, అని చెప్పుకుంటున్నారు. అయినా, ప్రజలు మాత్రం, కేసీఅర్ అండ్’కో ఎందుకు గత్తర గత్తర అవుతున్నారో , మాకూ తెలుసులే అని సోషల్ మీడియా సాక్షిగా నవ్వుకుంటున్నారు  అనుకోండి, అది వేరే విషయం. రాష్ట్రంలో కేసీఆర్ గ్రాఫ్’ రోజు రోజుకు పడి పోతోందని  ... మరో వంక, సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ( ఈడీ)ఉచ్చులు బిగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని ఆ కారణంగానే, జాతీయ రాజకీయాలంటూ కేసీఆర్ గత్తర గత్తర అవుతున్నారని, సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కామెంట్స్ ట్రోల్ అవుతున్నాయి. 

అదలా ఉంటే , మహారాష్ట్రలో కూడా, కేసీఆర్ బానే ట్రోల్ అవుతున్నారు.ఈడీ భయంతోనే కేసీఆర్ ముంబై వచ్చారనే అర్ధం వచ్చేలా ఉన్న ఈ కార్టూన్ ఏ పత్రికలో వచిందో ఏమో కానీ, మహారాష్ట్ర సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చిత్రం ఏమంటే, దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పక్షాలను ఏకం చేసే సత్తా కేసీఆర్కు మాత్రమే ఉందని కితాబు ఇచ్చిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్’ తమ ట్వీటర్ హండిల్ నుంచే, ఈ కార్టూన్ రీట్వీట్ చేస్తున్నారు.  అంటే, కేసీఆర్ అంటే శివసేన అభిప్రాయం ఏమిటో కూడా సంజయ్ రౌత్’ చక్కగా చెప్పారు.. మీకు అర్థముతోందా .. కేసీఆర్ సారో ..అంతే సంజయ్ రౌత్, కాంగ్రెస్ లేకుండా బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుకు శివసేన ఎట్టి పరిస్థితిలోనూ  అంగీకరించదాని కూడా మరో మారు స్పష్టం చేశారు.