TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఇంటర్‌ పరీక్షలు వాయిదా.. కొవిడ్ లేకున్నా ఎందుకిలా?

Published on: Thu Mar 3, 2022 1:14PM

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇంటర్‌ పరీక్షలు వాయిదా పడ్డాయి. పాత షెడ్యూల్‌ను వాయిదా వేసి.. కొత్త తేదీలను ఏపీ విద్యాశాఖ ప్రకటించింది. ఏప్రిల్ 22 నుంచి మే 12 వరకు ఇంట‌ర్ ఎగ్జామ్స్ జ‌రుగుతాయ‌ని తెలిపింది. 

గ‌త షెడ్యూల్‌ ప్రకారం ఇంటర్మీడియట్‌ పరీక్షలు ఏప్రిల్‌ 8 నుంచి 28 వరకు జరగాల్సి ఉంది. అయితే, జేఈఈ మెయిన్‌ పరీక్షలను ఏప్రిల్‌ 16 నుంచి 21 వరకు నిర్వహిస్తూ.. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ రెండు రోజుల కిందట షెడ్యూల్ రిలీజ్ చేసింది. దీంతో జాతీయ ఎంట్ర‌న్స్ టెస్టులు ఉన్నందున‌.. ఏపీలో ఇంట‌ర్ ఎగ్జామ్స్ పోస్ట్‌పోన్ చేస్తూ ఉత్త‌ర్వులు ఇచ్చింది విద్యాశాఖ‌. 

ఇక‌, ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ పరీక్షలను గతంలో ప్రకటించిన తేదీల్లోనే.. అన‌గా మార్చి 11 నుంచి మార్చి 31వరకు జరుగుతాయని విద్యాశాఖ‌ మంత్రి సురేశ్‌ తెలిపారు. కొవిడ్ నిబంధనల మేరకే పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఇన్విజిలేషన్‌కు సిబ్బంది సమస్య లేదని.. పది, ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు పరీక్షా కేంద్రాల ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బందులు లేవని మంత్రి సురేశ్ చెప్పారు.