TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా సమీకృత ఇంధన విధానం

Published on: Mon Sep 30, 2024 12:57PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టుబడులు, ఉద్యొగాల కల్పనే లక్ష్యంగా సమీకృత ఇంధన విధానాన్ని రూపొందించింది. ఈ విధానం ద్వారా పది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, 7.75 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుకుంది. సౌర, పవన, బ్యాటరీ స్టోరేజ్, ఎలక్ట్రోలైజర్స్, బయో ఫ్యూయెల్, పీఎస్పీ, హైబ్రిడ్ ఎనర్జీ ప్రాజెక్టులన్నిటీకీ కలిపి ఒకే విధానంగా ఈ సమీకృత ఇంధన విధానం రూపొందించింది.

గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను ప్రోత్సహించడం ద్వారా   రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ దేశాల నుంచి పెట్టు బడులను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే రాష్ట్రంలో వద్యుత్ ప్లాంట్ లను నెలకొల్పడానికి ముందుకు వచ్చే కంపెనీలకు బ్యాంకింగ్ సర్వీసులను అందజేయనుంది. అలాగే విద్యుత్ పునర్వినియోగానికి వీలుగా నిబంధనలను సులభతరం చేసింది. తద్వారా విద్యుత్ రుంగంలో పెట్టుబడులను వెల్లువెత్తడమే  కాకుండా ఉద్యోగ అవకాశాలు కూడా గణనీయంగా పెరుగుతాయని భావిస్తున్నది.

రాష్ట్రంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని గణనీయంగా పెంచాలన్న లక్ష్యంతో ఉన్న ప్రభుత్వం అందుకు చర్యలలో భాగంగా రానున్న ఐదేళ్లలో  500 విద్యుత్ వాహనాల రీచార్జింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వీటిలో 150 విద్యుత వాహనాల చార్జీంగ్ యూనిట్లను నగరాలు, పట్టణాలు, జిల్లా హెడ్ క్వార్టర్లలోనూ 150 ఈవీ చార్జింగ్ కేంద్రాలను జాతీయ రహదారులపై ఏర్పాటు చేయనుండగా, మిగిలిన వాటిని ప్రైవేట్ భవనాలలో ఏర్పాటు చేయనుంది.