TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ.. రూ.34 లక్షల టోకరా

Published on: Wed Jul 1, 2026 9:06PM

 

ఇన్‌స్టాగ్రామ్‌లో మొదలైన పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి యువతిని నమ్మించి శారీరక సంబంధాలు కొనసాగించిన అనంతరం, వ్యాపార విస్తరణ పేరుతో రూ.34 లక్షలు తీసుకుని మోసం చేశాడని ఆరోపిస్తూ ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు ఎన్. చందు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా బాధితురాలితో పరిచయం పెంచుకుని, వివాహం చేసుకుంటానని నమ్మించాడు. ఆ నమ్మకంతో ఇద్దరి మధ్య శారీరక సంబంధాలు ఏర్పడ్డాయి. అనంతరం వ్యాపార విస్తరణకు పెట్టుబడి అవసరమని చెప్పి బాధితురాలు, ఆమె తల్లి నుంచి సుమారు రూ.34 లక్షలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

అయితే, నిందితుడు ఇప్పటికే మరో మహిళను వివాహం చేసుకున్న విషయం ఇటీవల బాధితురాలికి తెలిసింది. దీనిపై ఆమె ప్రశ్నించగా దుర్భాషలాడటంతో పాటు దాడి చేసి బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

జూన్ 30న అందిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు బీఎన్‌ఎస్ చట్టంలోని సెక్షన్లు 69, 318(4), 115(2), 351(2) కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా జూలై 1న నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.