TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చిరంజీవితో జ‌గ‌న్ విందు రాజ‌కీయం అందుకేనా? చంద్ర‌బాబే టార్గెటా?

Published on: Thu Jan 13, 2022 11:59AM

సీఎం జ‌గ‌న్‌తో మెగాస్టార్ చిరంజీవి లంచ్ మీటింగ్‌. మామూలుగా అయితే ఇదేమంత బ్రేకింగ్ న్యూస్ కాదు. గ‌తంలోనూ చిరు దంప‌తులు తాడేప‌ల్లి ప్యాలెస్‌లో జ‌గ‌న్ జంట‌తో క‌లిసి విందు భేటీ జ‌రిపారు. అది జ‌రిగిన కొన్ని నెల‌ల‌కే మ‌రోసారి వారిద్ద‌రు లంచ్ మీటింగ్ జ‌ర‌ప‌డం.. అదికూడా ప్ర‌స్తుత హాట్ హాట్ సిట్యుయేష‌న్‌లో వారి భేటీ జ‌ర‌గ‌డం.. ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. గ‌తంలో చిరంజీవి ఎంత వేడుకున్నా ప‌ట్టించుకోని జ‌గ‌న్‌.. ఇప్పుడు స‌డెన్‌గా చిరును ఇంటికి ఆహ్వానించ‌డం వెనుక చంద్ర‌బాబు ఇటీవ‌ల చేసిన వ్యాఖ్య‌లే కార‌ణం అంటున్నారు. 

2009లో చిరంజీవి పార్టీ పెట్టకుంటే అప్పుడే అధికారంలోకి వచ్చేవాళ్లమని ఇటీవ‌ల చంద్ర‌బాబు అన్నారు. చిరంజీవి పార్టీ పెట్టకముందు, తర్వాత కూడా తనతో బాగానే ఉన్నారని.. ఇప్పుడు కూడా చిరంజీవి తనతో బాగానే ఉంటారని చంద్ర‌బాబు చెప్పారు. సినిమా టికెట్ల వివాదంలోకి టీడీపీని కూడా లాగుతున్నారని.. టీడీపీకి సినీ పరిశ్రమ సహకరించింది లేదని తెలిపారు. తాను సీఎంగా ఉన్నప్పుడు, ఈ మధ్య కూడా తనకు వ్యతిరేకంగా సినిమాలు తీశారని చంద్రబాబు గుర్తు చేశారు. 

చంద్ర‌బాబు చేసిన ఈ వ్యాఖ్య‌లే చిరుకు జ‌గ‌న్ అపాయింట్‌మెంట్ ఇవ్వ‌డానికి కార‌ణం అంటున్నారు. లేదంటే.. ఈ మ‌ధ్య ఓపెన్‌గా చిరంజీవి ఏపీ ప్ర‌భుత్వాన్ని ప్లీజ్ అంటూ వేడుకున్నా జ‌గ‌న‌న్న క‌నిక‌రించింది లేదు. అలాంటిది.. ఇప్పుడు చంద్ర‌బాబు కామెంట్లు చేసిన రెండు రోజుల గ్యాప్‌లోనే చిరును ఇంటికి పిలిపించుకుని.. విందు రాజ‌కీయం మొద‌లుపెట్టేశారు. చంద్ర‌బాబు.. చిరుపై, ఇండ‌స్ట్రీపై చేసిన వ్యాఖ్య‌ల‌ను త‌న‌కు అనుకూలంగా మార్చుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు జ‌గ‌న్‌. టాలీవుడ్‌పై చంద్ర‌బాబు అసంతృప్తితో ఉన్నారంటూ ఇప్ప‌టికే వైసీపీ శ్రేణులు ప్ర‌చారం మొద‌లుపెట్టేశాయి. ఇక టికెట్ ధ‌ర‌ల త‌గ్గింపుతో జ‌గ‌న్‌పై పెల్లుబికిన ఆగ్ర‌హాన్ని.. చిరంజీవి రాయ‌బారంతో కాస్త చ‌ల్లార్చాల‌ని చూస్తున్న‌ట్టు తెలుస్తోంది. 

ఇప్ప‌టికే త‌న మ‌నిషులు.. ఆర్జీవి-పేర్ని నానిల మీటింగ్‌తో స‌ర్కారు న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌లు మొద‌లుపెట్టింద‌నే ఇండికేష‌న్ ఇచ్చారు. ఇక చిరంజీవితో విందు భేటీ జ‌రిపి.. టికెట్ ధ‌ర‌ల‌పై కొద్దిగా వైఖ‌రి మార్చుకొని.. మెగాస్టార్ లాబీయింగ్‌తో ఇండ‌స్ట్రీని మ‌చ్చిక చేసుకోవాల‌ని స్కెచ్ వేశార‌ని అంటున్నారు. ఇదంతా చంద్ర‌బాబు ఇటీవ‌ల చిరంజీవిపై, సినీ ప‌రిశ్ర‌మ‌పై చేసిన వ్యాఖ్య‌ల ఫలితంగానే.. జ‌గ‌న్ ఇలా రూట్ మార్చార‌ని చెబుతున్నారు. మ‌రి, ఇప్ప‌టికే టికెట్ ధ‌ర‌ల త‌గ్గింపుతో.. ఇండ‌స్ట్రీని కుదిపేసిన జ‌గ‌న్‌ను.. టాలీవుడ్ మ‌ళ్లీ అంత ఈజీగా న‌మ్ముతుందా?  చిరంజీవితో భేటీ జ‌రిపినంత మాత్రాన జ‌గ‌న్ చేసిన అన్యాయం.. న్యాయ‌మై పోతుందా? అంటున్నారు.