TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రామ‌కృష్ణ సోద‌రితో రాఘ‌వ‌కు ఎఫైర్!.. త‌మ్ముడిపై అక్క ఆరోప‌ణ‌లు..

Published on: Sat Jan 8, 2022 11:53AM

వ‌న‌మా రాఘ‌వ వేధింపులు భ‌రించ‌లేక నాగ‌ రామ‌కృష్ణ కుటుంబం స‌జీవ ద‌హ‌నమైంది. ఈ ఘ‌ట‌న‌ యావ‌త్ తెలుగు ప్ర‌జ‌లను క‌లిచివేసింది. వ‌న‌మా రాక్ష‌స‌త్వంపై అంతా దుమ్మెత్తిపోశారు. రెండు రోజుల త‌ర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు. పార్టీ నుంచి టీఆర్ఎస్ బ‌హిష్క‌రించింది. ఈ ప‌రిణామాల‌న్నిటికీ కార‌ణం.. సోద‌రి, త‌ల్లితో రామ‌కృష్ణ‌కు ఆస్థి పంప‌కాల వివాదం. లేటెస్ట్‌గా రామ‌కృష్ణ చేసిన మ‌రో సెల్ఫీ వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చింది. అందులో సంచ‌ల‌న విష‌యాలు ఉన్నాయి. ఇక‌, మొత్తం గొడ‌వ‌కు కార‌ణ‌మైన రామ‌కృష్ణ సోద‌రి లీలా మాధ‌వి సైతం ఘ‌ట‌న‌పై స్పందించింది. వారింట్లో కొంత‌కాలంగా ఫ్యామిలీ ఫైట్ ఓ రేంజ్‌లో న‌డుస్తున్న‌ట్టు తెలుస్తోంది. 

తన బలవన్మరణానికి మొదటి సూత్రధారి వనమా రాఘవేంద్రరావు అని రామ‌కృష్ణ మ‌రో సెల్ఫీ వీడియోలో ఆరోపించారు. ఆ వీడియోలో మ‌రిన్ని సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించారు. "నా పరిస్థితికి సూత్రధారి రాఘవ. నా అక్క మాధవి, మా తల్లి సూర్యవతి సహకరించారు. 20 ఏళ్లుగా మా అక్కతో వనమా రాఘవకు వివాహేతర సంబంధం ఉంది. ఈ ముగ్గురూ కలిసి తండ్రి ద్వారా న్యాయబద్ధంగా నాకు రావాల్సిన ఆస్తిని అడ్డుకున్నారు. ఏడాది నుంచి వాటాలు పంచకుండా నా పరిస్థితిని చావుదాకా తీసుకొచ్చారు. నాకు 30లక్షలు అప్పులు అయ్యాయి. రాఘవ ఆస్తి పంపకాల విషయంలో జోక్యం చేసుకున్నారు. న్యాయం జరగదనే కుటుంబం సహా బలవన్మరణానికి పాల్పడుతున్నా." అని  రామకృష్ణ ఆ సెల్ఫీ వీడియోలో తెలిపారు. 

మ‌రోవైపు.. రామ‌కృష్ణ మ‌ర‌ణం, ఆయ‌న‌తో ఆస్తి వివాదం గురించి మృతుడి సోద‌రి లీలా మాధ‌వి స్పందించారు. తన తమ్ముడు నాగ రామకృష్ణతో ఆస్తి వివాదాలున్న మాట వాస్తవమేనని, కానీ ఇంతపని చేస్తాడనుకోలేదని లీలా మాధవి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. "1997లో పెళ్లి సమయంలో నాకు కట్నం కింద 2 ఎకరాలు ఇచ్చారు. నాలుగు నెలల క్రితం నా భర్త చనిపోయారు. హైదరాబాద్‌లోని ఆస్తి (పాట్ల) విషయంలో తమ్ముడితో వివాదం తలెత్తింది. ఇంత‌కుముందు ఒక‌సారి ఉరి వేసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. వనమా రాఘవతో మా కుటుంబానికి చాన్నాళ్లుగా పరిచయం ఉంది. సమస్య పరిష్కారానికి అతని ద‌గ్గ‌ర‌కు వెళ్లాం. ఆస్తిని 3 వాటాలు చేసుకోవాలని, తల్లి తదనంతరం ఆమె వాటా సోదరుడికి ఇవ్వాలని రాఘవ సూచించారు. ఆలోచించుకొని మరోసారి రమ్మన్నారు. మళ్లీ వెళ్లినప్పుడు నాకు వాటా ఇచ్చేందుకు త‌మ్ముడు రామ‌కృష్ణ‌ అభ్యంతరం చెప్పాడు. పెళ్లి సమయంలో రెండెకరాలిచ్చి మళ్లీ ఆస్తి ఎలా ఇస్తామని అన్నాడు. ఇప్పుడిలా ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం బాధాక‌రం" అని లీలామాధవి అన్నారు.