TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎస్ఆర్ఎం కాలేజీ ఫుడ్ పాయిజినింగ్ ఘటనపై విచారణకు కమిటీ

Published on: Thu Nov 6, 2025 4:13PM

 

అమరావతిలోని ఎస్ఆర్ఎమ్  కాలేజీలో ఫుడ్ పాయిజన్(  కలకలం రేగింది. మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత 300 మందికి పైగా విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో నలుగురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన సోమవారం చోటు చేసుకుంది. అయితే విషయాన్ని బయటకు రాకుండా కాలేజీ యాజమాన్యం మేనేజ్ చేసింది. అంతేకాదు విద్యార్ధులను ఇంటికి పంపించారు. విషయం బయటకు రాకుండా విద్యార్థులను, విద్యార్థుల తల్లిదండ్రులను బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది.

ఫుడ్ పాయిజన్ విషయాన్ని ఎక్కడా చెప్పొద్దని వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. కాగా కాలేజీలో విద్యార్థులు ఫుడ్ పాయిజినింగ్ తో అస్వస్థతకు గురి అయిన ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఎస్ఆర్ఎసం కాలేజీలో ఫుడ్ పాయిజనింగ్ పై గుంటూరు కలెక్టర్ తమీమ్ అన్సారియా అధ్యక్షతన కమిటీ వేసింది. విచారణాధికారిగా తెనాలి సబ్ కలెక్టర్ అంజనాసిన్హాను నియమించింది. ఆమె ఎస్ఆర్ఎం కాలేజీతో తనిఖీలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.  ఎస్ఆర్ఎం కాలేజీలో కలుషితాహారం తిని  300 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని ధృవీకరించారు.

ఈ కాలేజీలో ఆహారం నాణ్యతపై గత కొంత కాలంగా విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా కళాశాల యాజమాన్యం పట్టించుకోలేదన్నారు. ఎస్ఆర్ఎమ్ కళాశాలలో తరచుగా ఇటువంటి ఘటనలు జరగడానికి గల కారణాలను విచారిస్తున్నామని చెప్పిన అంజనా సిన్హా.. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.  కళాశాలలో ఆరువేల మంది విద్యార్థులకు ఆహారం అందిస్తున్నట్లు తెలిపిన ఆమె విద్యార్థుల అస్వస్థతకు గురి కావడానికి కారణాలపై విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక అందిస్తామన్నారు.