TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎన్ఎస్ఈ చైర్మన్ గా తెలుగు తేజం ఇంజేటి శ్రీనివాస్

Published on: Wed Sep 10, 2025 9:54AM

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ చైర్మన్ గా తెలుగుతేజం ఇంజేటి శ్రీనివాస్ నియమితులయ్యారు. ఒడిశా కేడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన ఇంజేటి ఎన్ఎస్ఈ చైర్మన్ గా మంగళవారం (సెప్టెంబర్ 10)  బాధ్యతలు చేపట్టారు. వచ్చింది.

ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ(ఐఎఫ్ఎస్సీఏ) మాజీ చైర్మన్ ఇంజేటి శ్రీనివాస్ ఇటీవలే ఎన్ఎస్ఈలో పబ్లిక్ ఇంటరెస్ట్ డైరెక్టర్ గా చేరారు. గతంలో ఆయన కార్పొరేట్ వ్యవహారాల శాఖ కార్యదర్శిగా కూడా పని చేశారు. గత రెండేళ్లుగా ఎన్ఎస్ఈ చైర్మన్ పదవి ఖాళీగా ఉంది. ఎన్ఎస్ఈ తొలి పబ్లిక్ ఇష్యూకి రెడీ అవుతున్న సమయంలో ఇంజేటి శ్రీనివాస్ నాయమకం జరిగింది.  

కార్పొరేట్, ఆర్థిక నియంత్రణలు, పారిశ్రామిక ప్రోత్సాహం, కార్పొరేట్, దివాలా చట్టం, కాంపిటీషన్ చట్టం, చార్టెడ్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ వంటి భిన్న రంగాల్లో  నాలుగు దశాబ్దాలకు పైబడిన అనుభవం ఉన్న ఇంజేటి కీలక సమయంలో ఎన్ఎస్ఈ చైర్మన్ గా నియమితులయ్యారు. ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుంచి బీఏ (ఆనర్స్) పూర్తి చేసిన ఇంజేటి శ్రీనివాస్ 1983లో ఒడిశా కేడర్ అధికారిగా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు.