పసిగుడ్డును కన్న తల్లి విసిరేస్తే కుక్కలు కాపాడాయి

 

 

కన్న బిడ్డను కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తల్లి తనకు పుట్టిన పసిగుడ్డును డ్రైనేజ్ లోకి విసిరేస్తే, నోరు లేని, విశ్వాసం గల కుక్కలు ఆ బిడ్డను కాపాడాయి. ఈ దారుణమైన  సంఘటన హర్యానా లో చోటు చేసుకుంది. హర్యానా రాష్ట్రంలోని కైతల్ ప్రాంతంలో అప్పుడే పుట్టిన పసిపాపను ప్లాస్టిక్ కవర్‌లో చుట్ట ఒక తల్లి  డ్రైనేజీలో విసిరేసింది. డ్రైనేజీలో ఉన్న ప్లాస్టిక్ మూటలో ప్రాణంతో ఉన్న పసిగుడ్డును చూసి కుక్కలు అరవటంతో చుట్టుపక్కల వాళ్ళు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో అక్కడకు చేరుకున్న పోలీసులు ఆ పాపను రక్షించి హాస్పిటల్ కు తరలించారు. ఐతే ఆ పాప బరువు తక్కువ ఉండటంతో పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా అక్కడ ఉన్న సిసి కెమరా ఫుటేజ్ ఆధారంగా ఆ పసిగుడ్డుని వదిలించుకునే ప్రయత్నం చేసిన ఆ తల్లిని గుర్తించి ఆమె ను వెతికే పనిలో పడ్డారు పోలీసులు.