TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మూత పడుతున్న రాష్ట్ర పరిశ్రమలు

Published on: Sat Aug 4, 2012 10:41AM

ఒకవైపు విద్యుత్తుకోత, మరోవైపు సాంకేతికలోపం రాష్ట్రంలోని పరిశ్రమలను దెబ్బతీస్తున్నాయి. పరిశ్రమల కోసమే గతంలో విద్యుత్తుఛార్జీలు తగ్గించి వనరులు కల్పించిన రాష్ట్రప్రభుత్వం సీరియస్‌గా ఈ సమస్య పరిష్కారానికి కృషి చేయటం లేదు. దీని వల్ల కోట్లాది రూపాయల నష్టాలను పరిశ్రమలు భరించ వలసి వస్తోంది. ఇదే విషయాన్ని పరిశ్రమల ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వానికీ విన్నవించుకుంటున్నాయి. కేంద్రంలోనూ మంత్రి వర్గ మార్పులు ఇంకా పూర్తికాకపోవటంతో ఈ సమస్యను అక్కడ కూడా సీరియస్‌గా తీసుకోవటం లేదు.

 

 

ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్టుకు ఎగుమతులు చేసే 24 గంటల విద్యుత్తు ఆథారిత పరిశ్రమలను 3 నెలల క్రితమే మూసేశారు. కొన్ని పరిశ్రమల్లో ఉద్యోగాల్లో రేషనలైజేషన్‌ను అమలు చేయాలని యామాన్యాలు సిద్ధపడుతున్నాయి. ప్రత్యేకించి స్థానిక నిరుద్యోగం పెంచటానికి కూడా ఈ విద్యుత్తు సమస్య కారణమవుతోంది. కిందిస్థాయిలో పనిచేసే స్థానిక ఉద్యోగులను తొలగించి సాంకేతికరంగంలో నిపుణులైన స్థానికేతరులకు పరిశ్రమలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. రోజుకు కనీసం రాష్ట్రవ్యాప్తంగా రూ.80 కోట్ల ఉత్పాదనలు దెబ్బతిన్నాయని అంచనా. సాంకేతిక లోపం వల్ల సింగరేణి గనుల్లో విద్యుత్తు ఆగిపోవటంతో ఒక్కరోజుకు రూ.4.5కోట్లు నష్టం వచ్చింది. 30వేల టన్నుల బొగ్గు ఉత్పాదన ఆగిపోవటం వల్ల ఈ నష్టం వచ్చిందని సింగరేణి యాజమాన్యం ధృవీకరించింది. బెల్లంపల్లిలోని 132కిలోవాట్ల విద్యుత్తు సబ్‌స్టేషనులో సాంకేతికలోపం తలెత్తి విద్యుత్తుసరఫరా నిలిచింది. సింగరేణిలోని 19గనుల్లో అంథకారం అలుముకుంది. మందమర్రి, బెల్లంపల్లి, శ్రీరాంపురం, రమాకృష్ణాపురం, గోలేటి గనుల్లో చిమ్మచీకటి వల్ల బొగ్గు ఉత్పాదన ఆగిపోయింది. ఇలానే జీడిపిక్కల పరిశ్రమల్లోనూ విద్యుత్తులోపం ఇబ్బంది పెడుతోంది.