TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

దుర్గమ్మను దర్శించుకున్న ఉపరాష్ట్రపతి సీ.పీ రాధాకృష్ణన్

Published on: Wed Sep 24, 2025 5:12PM

 

విజయవాడ ఇంద్రకీలాద్రిపై అన్నపూర్ణదేవిగా కనకదుర్గమ్మను భారత ఉపరాష్ట్రపతి సీ.పీ రాధాకృష్ణన్ సతీ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు ఉపరాష్ట్రపతికి ఘన స్వాగతం పలికి అమ్మవారి దర్శనం చేయించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. 

ఈరోజు సాయంత్రం పున్నమి ఘాట్ వద్ద నిర్వహించే విజయవాడ ఉత్సవ్ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి పాల్గొననున్నారు. అంతకుముందు ఎయిర్‌ఫోర్టులో ఆయనకు గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు