ఇండోనేసియాలో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ.!
Published on: Sat Aug 15, 2026 7:19AM

ఇండోనేషియాను భారీ భూకంపం కుదిపేసింది. శనివారం (ఆగస్టు 15) తెల్లవారుజామున భూమి కంపించింది. సముద్ర గర్భంలో పది కిలో మీటర్ల లోతున సంభవించిన ఈ భూకంపం ధాటికి అనేక ద్వీపాలు, తీరప్రాంత నగరాలు ఉలిక్కిపడ్డాయి. రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం వల్ల సంభవించిన ప్రకంపనలకు ప్రజలు భయాందోళనలకు గురైఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం, ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదు అయ్యింది. సముద్ర ఉపరితలం నుంచి కేవలం 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం ఉంది. భూకంపం ఇంత తక్కువ లోతులో సంభవించడంతో ప్రకంపనల తీవ్రత భారీగా ఉంది.ఈ భూకంపం కారణంగా సునామీ వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
. భూకంప కేంద్రానికి 300 కిలోమీటర్ల పరిధిలోని తీరప్రాంత ప్రజలందరూ తక్షణం తమ ఇళ్లు ఖాళీ చేసి, ఎత్తైన సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. సముద్రంలో 1 నుంచి 3 మీటర్ల ఎత్తు వరకు రాకాసి అలలు ఎగసిపడి తీరాన్ని ముంచెత్తే ప్రమాదం ఉందని వాతావరణ నిపుణులుహెచ్చరించారు. కేవలం ఇండోనేషియా మాత్రమే కాకుండా పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం పొరుగు దేశాలైన ఫిలిప్పీన్స్, మలేషియా, ఆస్ట్రేలియాలను అప్రమత్తం చేస్తూ ప్రమాద హెచ్చరికలను జారీ చేసింది.
సమాచారం అందిన వెంటనే ఇండోనేషియా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ రంగంలోకి దిగి, సహాయక చర్యలను వేగవంతం చేసింది. శోధన బృందాలను తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాలకు తరలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం పలు ప్రాంతాల్లో పెద్ద పెద్ద భవనాలు దెబ్బన్నాయి.
Indonesia Earthquake, 77 Magnitude Quake, Tsunami Warning Indonesia, USGS Earthquake Report, BMKG Indonesia, Pacific Ring of Fire


