సృష్టికే షాక్.. గుడ్లు పెడుతున్న బాలుడు..!!

సాధారణంగా సర్పజాతికి చెందిన ప్రాణులు.. పక్షులు గుడ్లు పెడుతూ ఉంటాయని మనం చిన్నప్పుడు సైన్స్ పుస్తకాల్లో చదివాం. జీవ పరిణామక్రమంలో అది సహజంగా జరిగే ప్రాసెస్. సృష్టి ఆరంభం నుంచి ఈ సైకిల్‌ నిరాంతరాయంగా కొనసాగుతూనే ఉంది. అలాంటిది ప్రకృతికి భిన్నంగా మనిషి గుడ్లు పెడితే.. ఇప్పటి వరకు హాలీవుడ్ సినిమాల్లో.. కొన్ని కథల్లో మాత్రమే చూసిన.. వినిపించిన మాట ఇది. ఇలాంటి వింత నిజంగా జరిగితే.. అవును.. నమ్మడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఆధారాలు చూస్తే నమ్మక తప్పదు.

 

ఇండోనేషియాకు చెందిన అక్మల్ అనే 14 ఏళ్ల కుర్రాడు గుడ్లు పెడుతున్నాడు. 2015 నుంచి ఇప్పటి వరకు 20కి పైగా గుడ్లు పెడుతున్నట్లు ఈ కుర్రాడి తండ్రి తెలిపాడు. మలద్వారం గుండా గుడ్లు వస్తున్నాయని.. వాటిని తెరచి చూడగా.. తెల్లసోన లేదా మొత్తం పచ్చసోనతో అచ్చం కోడిగుడ్లను పోలి ఉన్నాయట. అయితే అనారోగ్యం వల్ల ఇలా జరుగుతుందా..? లేకపోతే.. ఈ కుర్రాడు గుడ్లు ఏమైనా మింగాడా అన్న అనుమానంతో వైద్యుల దగ్గరకి తీసుకెళ్లగా.. పరీక్షించిన వైద్యులు గుడ్లు తేలేశారట. ఎన్ని పరీక్షలు చేసినా.. అక్మల్‌కు ఎందుకిలా జరుగుతుందో కనిపెట్టలేకపోయారట. మానవ శరీరం నుంచి గుడ్లు రావడమనేది అసాధ్యమని తెలిసినప్పటికీ.. జరుగుతున్నది చూస్తుంటే నమ్మక తప్పడం లేదని వారు వాదిస్తున్నారు. అయితే వైద్యుల సమక్షంలో అక్మల్ గుడ్డు పెట్టిన వీడియో ప్రజంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ కుర్రాడిని పరీక్షించడానికి పరిశోధకులు ఇండోనేషియా బయలుదేరారు.