బొమ్మాలండీ బొమ్మలు..ఇండియా టాయ్ ఫెయిర్ 

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ,ద ఇండియా టాయ్ ఫెయిర్ 2021’ బొమ్మల కొలువును శనివారం (ఫిబ్రవరి 26) ప్రారంభించారు.ఈ సందర్భంగా ప్రధానమంత్రి భారతీయ బొమ్మల విశిష్టతను వివరించారు. భారతీయ బొమ్మలు సహజసిద్ధ ప్రకృతి వర్ణాలలో  పర్యావరణహితంగా కొలువు తీరతాయని వివరించారు. అలాగే, భార‌తీయుల సైకాల‌జీ, జీవావ‌ర‌ణానికి త‌గ్గిన‌ట్లు బొమ్మ‌ల‌ను త‌యారు చేయాల‌ని ప్ర‌ధాని బొమ్మ‌ల ఉత్ప‌త్తిదారుల‌ను కోరారు. సాధ్య‌మైనంత వ‌ర‌కు బొమ్మ‌ల త‌యారీలో ప్లాస్టిక్‌ను త‌గ్గించాల‌ని, రీసైక్లింగ్‌కు అనువైన ప‌దార్ధాల‌ను వాడాల‌ని ఆయ‌న సూచించారు. బొమ్మ‌ల ప‌ర్యాట‌కాన్ని అభివృద్ధి చేయాల‌ని త‌మ ప్ర‌భుత్వం భావిస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.విశ్వ‌వ్యాప్తంగా భార‌తీయ బొమ్మ‌ల‌కు డిమాండ్ ఉంద‌ని, మేడిన్ ఇండియాకు గుర్తింపు ఉన్న‌ట్లు.. హ్యాండ్ మేడ్ ఇన్ ఇండియా బొమ్మ‌ల‌కు కూడా మార్కెట్ ఉంద‌ని మోదీ అన్నారు. జాతీయ బొమ్మ‌ల కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ను రూపొందించామ‌ని,  15 మంత్రిత్వ‌శాఖ‌ల‌తో ఆ కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ను అనుసంధానం చేశామ‌ని ప్ర‌ధాని తెలిపారు.


ప్రధానమంత్రి చెప్పిన మాటలను అలా ఉంచితే, బొమ్మలు అనగానే, మను ముందుగ గుర్తుకు వచ్చేది బొమ్మల్ కొలువు. అలాగే,  తెలుగు సాహిత్యంలో, సినిమా సాహిత్యంలో బొమ్మల కొలువు పాటలు ఎన్నో ఎన్నెన్నో, దేవత చిత్రం కోసం మహాకవి శ్రీ శ్రీ రాసిన,  ‘బొమ్మను చేసి ప్రాణం పోసీ ఆడేవు నీకిదో వేడుక’ వంటి విషాద గీతం మొదలు, చిట్టి పొట్టి బొమ్మలు చిన్నారీ బొమ్మలు, బుల్లి బుల్లి రాధకు, ముద్దు ముద్దు రాజుకు పెళ్లండీ పెళ్లి’ అంటూ బొమ్మల పెళ్లిని వర్ణిస్తూ సాగే యుగాల గీతాల వరకు ఎన్నో సినీ జానపద గీతాలు తెలుగు లోగిళ్ళలో వినిపిస్తూనే ఉంటాయి.

అదలా ఉంటే, దసరా ఉత్సవాలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే బొమ్మల కొలువు గురించి ఎంత చెప్పుకున్నా,తక్కువే. బొమ్మల కొలువు అందాన్ని,ఆనందాన్ని పంచడమే కాదు,బొమ్మలను తయరు చేసే కళాకారుల సృజనాత్మకతను పట్టి చూపుతుంది. బొమ్మల కొలువు భారత దేశంఅంతటా జరుపుకునే వేడుకే అయినా, ఒక్కొక ప్రాంతంలో ఒక్కొక్క రూపంలో ఒక్కొక పేరుతో జరుపుకుంటారు. బొమ్మల కొలువు ముఖ్యంగా మహిళలు, పిల్లలు జరుపుకునే వేడుకే అయినా ఆబాల గోపాలం ఈ వేడుకల ఆనంద అనుభూతిని ఎప్పటికీ మరిచి పోలేరు. ఇక ఆధునిక బొమ్మలకొలువువిషయానికి వస్తే, ఇప్పడు ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్   బొమ్మలు ఎక్కువగా ప్రాచుర్యం పొందుతున్నాయి. ఈ నేపధ్యంలో జరుగతున్న ఇండియా టాయ్ ఫెయిర్ 2021’ లో ప్రపంచ దేశాలు ఎన్నో పాల్గొంటున్నాయి. ఇది.. మన సంస్కృతీ సంప్రదయాలను విదేశాలకు పరిచయం చేయడమే కాకుండా, మన బొమ్మలకు అంతర్జతీయ మార్కెట్ కలిపిస్తుంది