TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వరల్డ్ బ్యాడ్మింటన్ లో శ్రీకాంత్ కు రజతం.. తొలి ఇండియన్ గా రికార్డ్ 

Published on: Sun Dec 19, 2021 7:55PM

స్పెయిన్ లో జరుగుతున్న వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ ఫైనల్లో భారత ఆటగాడు, తెలుగు తేజం  కిడాంబి శ్రీకాంత్ ఓటమిపాలయ్యాడు. పురుషుల సింగిల్స్ టైటిల్ సమరంలో శ్రీకాంత్ 15-21, 20-22తో సింగపూర్ కు చెందిన లో కీన్ యూ చేతిలో వరుసగా గేముల్లో పరాజయం చవిచూశాడు. తొలి గేమ్ లో పేలవంగా ఆడిన శ్రీకాంత్, రెండో గేములో పోరాడినా ఫలితం లేకపోయింది. కీలక సమయాల్లో పాయింట్లు సాధించిన కీన్ యూ... ప్రపంచ విజేతగా అవతరించాడు.

రజత పతకంతో సరిపెట్టుకున్నాడు  కిదాంబి శ్రీకాంత్. ఈ గేమ్‌లో శ్రీకాంత్ తీవ్రంగా పోరాడినప్పటికీ ప్రత్యర్థి కీన్ యూ ఎలాంటి అవకాశం ఇవ్వకుండా కట్టడి చేశాడు. అయినప్పటికీ చివరి వరకు పోరాడిన కిడాంబి.. ప్రత్యర్థి స్మాష్‌ల ముందు నిలవలేకపోయాడు. ఫైనల్లో ఓడిపోయినా శ్రీకాంత్ అరుదైన రికార్డును తన పేర లిఖించుకున్నాడు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం గెలుచుకున్న తొలి భారతీయ షట్లర్‌గా రికార్డులకెక్కాడు. ఈ వేదికపై భారత్‌కు ఇది రెండో పతకం. సెమీస్‌లో కిడాంబి చేతిలో ఓడిన లక్ష్యసేన్‌ ఇప్పటికే కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు శ్రీకాంత్ రజతం సాధించాడు.