TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రైల్వే రిజర్వేషన్‌లో కీలక అప్‌డేట్

Published on: Mon Sep 15, 2025 8:21PM

 

సాధారణ రిజర్వేషన్‌ రిజర్వేషన్ టికెట్లకూ ఆధార్‌ అథెంటికేషన్‌ను తప్పసరి చేస్తూ ఇండియన్ రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే బుకింగ్స్  ఓపెన్ అయిన తొలి 15 నిమిషాలు కేవలం అథార్‌ వెరిఫైడ్‌ యూజర్లు మాత్రమే ఐఆర్‌సీటీసీ లేదా అధికారిక యాప్‌లో టికెట్లు రిజర్వేషన్‌ చేసుకునేందుకు వీలుంటుంది. ప్రస్తుతం ఇది తత్కాల్‌ బుకింగ్‌ విధానంలో అమల్లో ఉంది. అక్టోబర్‌ 1 నుంచి సాధారణ రిజర్వేషన్లకు కూడా వర్తింపజేస్తున్నట్లు తెలిపింది. ఇటీవల తత్కాల్ బుకింగ్స్‌కు ఈ విధానాన్ని ప్రవేశపెట్టగా తాజాగా సాధారణ రిజర్వేషన్‌ రిజర్వేషన్‌కూ వర్తింపజేయనుంది.

ఏదైనా ట్రైన్‌కు ప్రస్తుతం 60 రోజుల ముందే టికెట్‌ రిజర్వేషన్‌ చేసుకునేందుకు అవకాశం ఉంది. కానీ, తత్కాల్‌ టికెట్ల మాదిరిగానే బుకింగ్‌ ప్రారంభమైన వెంటనే అక్రమార్కులు సాఫ్ట్‌వేర్ సాయంతో టికెట్లను బుక్‌ చేసేస్తున్నారు. దీంతో సాధారణ ప్రయాణికులు నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో రిజర్వేషన్‌ టికెట్లు పక్కదోవ పట్టకుండా సామాన్య యూజర్‌కు ఆ ప్రయోజనాలు అందాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత రైల్వే బోర్డు పేర్కొంది.