అమెరికా ఎన్నికల్లో భారతీయం
Published on: Wed Nov 6, 2024 10:08AM

అమెరికా ఎన్నికలలో పలువురు భారత సంతతికి చెందిన నేతలు విజయం సాధించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో భారత సంతతికి చెందిన కమలాహారిస్ పోటీపడుతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలలో వివిధ రాష్ట్రాలలో పలువురు భారతీయులు కూడా రంగంలో నిలిచారు.
వారిలో డెమొక్రటిక్ పార్టీకి చెందిన రాజా కృష్ణమూర్తి ఇల్లినోయి నుంచి ప్రతినిథుల సభకు పోటీ పడి విజయం సాధించారు. అలాగే నార్తర్న్ వర్జీనియాలో సుహాస్ సుబ్రహ్మణ్యం విజయం సాధించారు. ఈయన కూడా డెమొక్రటిక్ పార్టీకి చెందిన వారే. సుహాన్ సుబ్రహ్మణ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా హయాంలో ఆయనకు సాంకేతిక విధాన సలహాదారుగా పని చేశారు.


