TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

అమెరికాలో మరో భారతీయుడి కాల్చివేత

Published on: Sat Mar 4, 2017 2:08PM

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆ దేశంలో భారతీయుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోంది. తెలుగు ఇంజనీర్ శ్రీనివాస్ కూచిబోట్ల దారుణహత్య విషాద ఘటన నుంచి ప్రవాస భారతీయులు, భారతదేశం తేరుకోకముందే మరో భారతీయుడు జాత్యహంకార దాడికి గురయ్యాడు. దక్షిణ కరోలినాలో హర్నీష్ పటేల్ అనే వ్యాపారవేత్తను గుర్తుతెలియని దుండగులు ఇంటి సమీపంలోనే కాల్చి చంపారు.

 

 

అమెరికా కాలమానం ప్రకారం గత గురువారం రాత్రి 11.24 గంటల ప్రాంతంలో ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. పటేల్ హత్యకు గురైన సమయంలో ఆయన భార్య, పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. స్థానికంగా స్పీడీ మార్ట్ అనే స్టోర్‌ను నడుపుతున్న ఆయనకు లాంకాస్టార్ ప్రాంతంలో మంచి పేరుంది. పటేల్ చాలా మంచి వ్యక్తి అని, కస్టమర్లతో చాలా మర్యాదగా వ్యవహరిస్తారని స్థానిక అమెరికన్లు అంటున్నారు. అలాంటి ఆయన హత్యకు గురికావడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన స్టోర్ బయట ప్రజలు పటేల్‌కు నివాళులు ఆర్పించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.