మళ్లీ పేలిన పెట్రోబాంబ్
Published on: Fri Sep 13, 2013 8:24PM

కేంద్ర తీసుకున్న నిర్ణయం మరోసారి సామన్యుడి వెన్ను విరిచింది. పెట్రోలు ధరను నిర్ణయించుకునే అధికారం ఆయిల్ కంపెనీలకే అప్పగించిన ప్రభుత్వం ధరలు నియంత్రించకపోవడంతో ఆయిల్ కంపెనీలు ఇష్టారాజ్యంగా ధరలను పెంచేస్తున్నాయి. ధరను పెంచి 15 రోజుల కూడా గడవక ముందే ఇప్పుడు మరోసారి పెట్రో బాంబును పేల్చాయి ఆయల్ కంపెనీస్.
లీటర్ పెట్రోల్ ధరను రు.1.63 పెంచుతూ దేశీయ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ (ఐఓసీ) నిర్ణయం తీసుకుంది. దీనికి వ్యాట్ అదనంగా పడటంతో 2 రూపాయలకు పైగా పెట్రోలు రేటు పెరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్లొ రూపాయి విలువ హెచ్చు తగ్గులతో పాటు క్రూడ్ ఆయిల్ ధరలు పెరగటంతో పెట్రో రేటు పెంచక తప్పడం లేదంటున్నాయి ఆయిల్ కంపెనీలు.
దీంతో భారత్లోని ప్రదాన నగరాల్లో ఇప్పటికే 8 రూపాయలకు పైగా ఉన్న లీటర్ పెట్రోలు ధర ఈ అర్ధరాత్రి నుంచి మరో రెండు రూపాయలు పెరనుంది.


