TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కష్టపడి ఒక్కపైసా తగ్గించారుగా.. అంత పరాచకాలా..!

Published on: Wed May 30, 2018 6:20PM

 

నిజంగా ప్రజలంటే ఎంత చులకనగా కనిపిస్తున్నారో మరోసారి రుజువు చేసింది కేంద్రప్రభుత్వం. మరీ ఇంత తేలికగా కనిపిస్తున్నారా..అన్నట్టు చేసింది. గత కొద్దిరోజులుగా పెట్రోలు, డీజిల్ ధరలపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్న సంగతి తెలిసిందే. రోజు రోజుకూ ధరలు పెరుగుతుండటంతో... ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే ఇప్పడు మొదటిసారి ఆయిల్ కంపెనీలు వీటి ధరలను తగ్గించాయి. కానీ తగ్గిన ధరలు చూసి ప్రజలు ఏం మాట్లాడాలో తెలియక షాక్ లో ఉన్నారు. ఇంతకీ ధరలు ఎంత తగ్గాయో తెలుసా...?ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) మొదట విడుదల చేసిన ప్రకటన ప్రకారం లీటరు పెట్రోలు ధర 60 పైసల చొప్పున, లీటరు డీజిల్ ధర 56 పైసల చొప్పున తగ్గింది. పోనీలే కాస్త తగ్గాయి అని సామాన్యులు సంతోషించే కొద్దిసేపటికే.. ఇదంతా తూచ్....తమ వెబ్‌సైట్‌లో సాంకేతిక లోపం వచ్చిందని, అందుకే పెట్రోలు, డీజిల్ ధరల సవరణలో పొరపాటు జరిగిందని, తగ్గింది 60 పైసలు కాదని, ఒక్క పైసా మాత్రమేనని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించింది. దాంతో ఒక్క పైసా తగ్గడంతో వినియోగదారులు షాకయ్యారు. అంతేకాదు... ఐఓసీ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనిపై సోషల్ మీడియాలో కూడా కామెంట్లు విసురుతున్నారు.

 

ఇదిలా ఉండగా.. ఇక ఈ ఒక్కపైసా తగ్గింపుపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించి మోడీపై సెటైర్లు వేశారు. మీరేమైనా ప్రజలతో పరాచకాలు ఆడుతున్నారా.. ఒక్క పైసా తగ్గించడం ఏంటీ... మీరు చేసింది పిల్ల చేష్టల్లా ఉన్నాయి అని మండిపడ్డారు. అంతేకాదు..తాను చేసిన ఫ్యూయల్ ఛాలెంజ్ పై కూడా స్పందించి.. నేను ఫ్యూయల్ ఛాలెంజ్ చేశాను కదా అని... దానికి ఈ రకంగా సమాధానం చెబుతారా అని ప్రశ్నించారు. మరి నిజంగానే పరాచకాలు కాకపోతే.. తగ్గించకపోతే అసలు తగ్గించకుండా ఉండాలి అంతేకానీ... ఒక్క పైసా తగ్గించి ప్రజలతో పరాచికాలు ఆడటం ఏంటీ..!