TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

భవిష్యత్తులో జరిగే ఏ ఉగ్ర చర్యనైనా యుద్ధంగా పరిగణిస్తాం..భారత్ సంచలన నిర్ణయం

Published on: Sat May 10, 2025 5:11PM

 

భారత్ ప్రభుత్వం టెర్రరిజంపై సంచలన నిర్ణయం తీసుకుంది.  భవిష్యత్‌లో ఎలాంటి ఉగ్రదాడి జరిగినా దానిని ఇండియాపై  యుద్దంగానే పరిణిస్తామని నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అందుకు తగినట్లుగానే తీవ్ర ప్రతి చర్య ఉంటుందని వెల్లడించారు. ఈ మేరకు కేంద్ర రక్షణ శాఖ  స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తీవ్రవాద చర్యలను సహించేది లేదు. పాకిస్తాన్‌లోకి చొరబడి వెంటాడి మరీ విధ్వంసకారులను మట్టుబెట్టాలి. ఉగ్రవాద చర్యలను సరైన రీతిలోనే ఎదుర్కోవాలి” అని ఆయన తేల్చి చెప్పారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో దేశ భద్రతపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన అనంతరం ప్రధాని  ఈ నిర్ణయం తీసుకున్నారు. 

సరిహద్దుల్లో ఉగ్రవాద శిబిరాలపై నిఘా పెంచాలని, అవసరమైతే సైనిక చర్యలకు కూడా వెనుకాడవద్దని ఆయన సైన్యానికి సూచించారు. ఈ నిర్ణయం ప్రకారం, ఉగ్రవాద దాడులను కేవలం శాంతిభద్రతల సమస్యగా కాకుండా, దేశంపై జరిగిన దాడిగా పరిగణిస్తారు. దీంతో సైన్యానికి మరింత స్వేచ్ఛ లభిస్తుంది. ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకునేందుకు భారత ఆర్మీకి పూర్తి అధికారం లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పాక్‌కు స్పష్టమైన హెచ్చరికగా పరిగణించవచ్చు. ఉగ్రవాదానికి మద్దతు ఇస్తే తీవ్ర పరిణామాలు తప్పవని భారత్ స్పష్టం చేసింది. ఇకపై ఉగ్రవాద చర్యలను భారత్ ఏమాత్రం సహించబోదని, దీటుగా బదులివ్వడానికి సిద్ధంగా ఉందని ఈ నిర్ణయం ద్వారా ప్రపంచానికి చాటి చెప్పింది.