TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

భారత జాలర్లపై శ్రీలంక నేవీ కాల్పులు...

Published on: Tue Mar 7, 2017 10:45AM

 

భారత్ జాలర్లపై శ్రీలంక నేవీ సిబ్బంది మరోసారి తమ ప్రతాపం చూపించారు. భారత జాలర్లపై కాల్పులు జరిపారు. వివరాల ప్రకారం....బంగాళఖాతంలో చేపలు పట్టడానికి గాను తమిళనాడులోని రామేశ్వరం నుంచి పెద్ద సంఖ్యలో జాలర్లు వెళ్లారు. వీరంతా కచ్చతీవులు సమీపంలో చేపలు పడుతుండగా... శ్రీలంక నేవీ సిబ్బంది అక్కడకు చేరుకొని కనీసం ఎలాంటి హెచ్చరికలు కూడా జారీ చేయకుండానే... జాలర్లపై కాల్పులు జరిపింది. ఆ సమయంలో మొత్తం 2వేల మంది జాలర్లు అక్కడ ఉండగా.... ఈ కాల్పుల్లో ఒక మత్స్యకారుడు ప్రాణాలు కోల్పోగా... మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.