TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

భారత సైన్యానికి ఆహారంగా పాములు, తేళ్లు

Published on: Fri Mar 3, 2017 9:38AM

ప్రపంచంలోని ఏ దేశ సైన్యానికి తీసిపోని ధైర్యసాహసాలు మన సైన్యానికి ఉన్నాయి. ఎటువంటి క్షిష్ట పరిస్థితుల్లోనైనా చెక్కు చెదరని ఆత్మస్థైర్యం మన సొంతం. అయితే వారిని మరింత రాటు తేల్చేందుకు ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నారు. అత్యంత కఠిన పరిస్థితుల మధ్య యుద్ధం చేయాల్సి వస్తే..తినడానికి తిండి లేని పక్షంలో ఎలా ముందుకు వెళ్లాలి అన్న విషయంలో భాగంగా భారత జవాన్లకు కఠోర శిక్షణను ఇస్తున్నారు.

ఇందులో భాగంగా పాములు, తేళ్లు, వివిధ రకాల కీటకాలను తినేలా శిక్షణ ఇస్తున్నారు. మిజోరంలోని జంగిల్ వార్ ఫేర్ స్కూళ్లో ఈ తరహా శిక్షణలో సైన్యం పదును తేలుతోంది. ఈశాన్య రాష్ట్రాల్లో దాగున్న ఉగ్రవాదులు, చొరబాటుదారులను ఏరివేయడంతో పాటు, జమ్మూకశ్మీర్ ప్రాంతంలో దాగిఉన్న ఉగ్రవాదులతో పొరాడే సమయంలో రోజుల తరబడి జనావాసాలకు దూరంగా ఉండాల్సి వచ్చినపుడు ఇలాంటి శిక్షణ ఉపయోగపడుతుందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు.