అదరగొట్టిన సూర్య .. 3వ వన్డేలో భారత్ విజయం
Published on: Wed Aug 3, 2022 11:47AM
వెస్టిండీస్‌తో తలపడిన మూడవ వన్డేలో భారత్ ఓపెనర్ సూర్యకుమార్ మెరుపువేగంతో అర్ధసెంచరీ చేయడంతో, రిషబ్ సహజసిద్ధ బ్యాటింగ్ సత్తాతో ఘనవిజయం సాధించింది. సూర్యకుమార్ 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 44 బంతుల్లో 76, రిషబ్ 26 బంతుల్లో 3ఫోర్లు, ఒక సిక్స్‌తో 33 పరుగులుచేసి నాటౌట్‌గా నిల వడం తో భారత్ 19 ఓవర్లలోనే 3 వికెట్ల నష్టానికి 165 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. విజయంతో టీమిండియా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో నిలిచింది.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా ఆతిథ్య జట్టు బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్ కైల్ మేయర్స్ (50 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 73) అర్ధ సెంచ రీతో రాణించాడు. భారత బౌలర్లలో భువనేశ్వర్‌కు 2 వికెట్లు, హార్దిక్, అర్ష్‌దీప్ తలో వికెట్ పడ గొట్టారు.
అనంతరం 165 పరుగుల లక్ష్య చేధనతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్ సూర్యకుమార్ చెలరేగి తన బ్యాటింగ్ సత్తాను ప్రదర్శించి సునాయాస విజయాన్ని అందించాడు. మొదటి రెండు మ్యాచుల్లో నిరాశ పరిచిన సూర్య, ఈ మ్యాచ్‌లో మాత్రం విండీస్ బౌలర్లపై మొదటి నుంచే ధాటిగా ఆడాడు. వరుస బౌండరీ లతో హోరెత్తించాడు. కాగా జట్టు స్కోర్ 135 పరుగుల వద్ద వెనుదిరిగిన అప్పటికే భారత్ విజయం ఖాయ మైపోయింది. దీపక్ హుడా (10 నాటౌట్)తో కలిసి పంత్ మిగతా పని పూర్తి చేశాడు. భారత విజయంలో కీలక పాత్ర పోషించిన సూర్యకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.


