పాక్ దాడి చేస్తే మనకే మంచిది.. వెయిటింగ్ లో మోడీ సర్కార్ !!

 

 

జమ్మూ కాశ్మీర్ విషయం లో మోడీ ప్రభుత్వం ఆర్టికల్ 370 ని రద్దు చేసిన తరువాత పాకిస్తాన్ రగిలిపోతోంది. ఇదే విషయం పై అంతర్జాతీయ సమాజం లో భారత్ ను ఏకాకి చేసేందుకు చేసిన ప్రయత్నాలు ఏవి సఫలం కాలేదు.  ఈ విషయంలో ఆ దేశంతో  అంతర్జాతీయంగా కలిసి వచ్చే దేశాలు ఏవి కనపడక పోవడం తో పాక్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. తాజాగా పాక్ విదేశాంగ మంత్రి కూడా ఇదే విషయం పై మాట్లాడుతూ పాక్ కు  ఎవరూ మద్దతు తెలపడం లేదని ఆవేదన చెందారు. అగ్ర రాజాలైన అమెరికా, రష్యా మేము ఈవిషయంలో కల్పించుకోమని స్పష్టం చేసాయి. పాక్ మిత్ర దేశమైన  చైనా కూడా ఇప్పుడు హ్యాండ్ ఇవ్వడం తో ఏం చేయాలో తెలియని దిక్కు తోచని పరిస్థితి. ఐతే పాక్ మాత్రం తన కుయుక్తులను కొనసాగిస్తూ లడఖ్ ప్రాంతంలో ఎఫ్ 16  యుద్ధ విమానాలను మోహరించింది. ఐతే ఉగ్రవాదులకు వ్యతిరేకంగా వాడాల్సిన వాటిని భారత్ కు వ్యతిరేకంగా వాడటం పై అమెరికా ముందే హెచ్చరించింది.

 

 

మరి సరిహద్దు లో ఇంత జరుగుతుంటే భారత్ ఏం చేస్తోంది అంటే పాక్ ఎప్పుడు దాడి చేస్తుందా అని ఎదురు చూస్తున్నట్లు సమాచారం. ఒకసారి పాక్ భారత భూభాగం పై దాడి  చేయడం మొదలు పెడితే అపుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ అలాగే పాక్ భూభాగం లోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రత్యేక దళాలు సరిహద్దులో సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.  అసలే అప్పులలో మునిగి తేలుతున్న పాక్ ను, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను విముక్తం చేయడం ద్వారా చావు దెబ్బ తీయాలని మోడీ ప్రభుత్వ ప్లాన్ గా తెలుస్తోంది.