112కి కుప్పకూలిన భారత్..

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ధర్మశాలలో శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ 112 పరుగులకు కుప్పకూలింది. లంక బౌలర్ల ధాటికి భారత ఆటగాళ్లను ఓ ఆట ఆడుకున్నారు. సీమర్లకు అనుకూలిస్తున్న పిచ్ పై నిప్పులు చెరిగే బంతులు విసురుతూ బంతులు వేయడం వాటిని ఎలా ఆడాలో తెలియక టీమిండియా బ్యాట్స్‌మెన్ ఒకరి వెంట ఒకరు పెవిలియన్‌కు క్యూకట్టారు. ఈ క్రమంలో కేవలం 16 పరుగులకే సగం వికెట్లను కోల్పోయింది ఇండియా. పీకల్లోతు కష్టాల్లో పడిన జట్టును మాజీ కెప్టెన్ ధోనీ ఆదుకున్నాడు. ఒక వైపు వికెట్లు పడుతున్నా సహనం కోల్పోకుండా లంక బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. జట్టును 100 పరుగులు దాటించిన తర్వాత మహేంద్రుడు అవుటవ్వడంతో ఇక భారత్ కథ ముగిసింది. లంక బౌలర్లలో లక్మల్ 4, మ్యాథ్యూస్ 1, ఫెర్నాండో 2, పెరీరా, ధనుంజయ, పతిరణ తలో ఒక వికెట్ పడగొట్టారు.