టీమిండియా టపటపా..189కే అలౌట్
Published on: Sat Mar 4, 2017 2:39PM
.jpg)
పుణే టెస్టులో ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాజయం తర్వాత కూడా టీమిండియా బ్యాట్స్‌మెన్లు గుణపాఠం నేర్చుకోలేదనుకుంటా. భారత్-ఆస్ట్రేలియా మధ్య బెంగళూరులో జరుగుతున్న టెస్టులో ఆసీస్ బౌలర్ల ముందు భారత్ నిలబడలేకపోయింది. కేవలం 189 పరుగులకే టీమిండియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఆ ఆనందం కొద్దిసేపు కూడా నిలవలేదు ఓపెనర్ అభినవ్ ముకుంద్ స్టార్క్ బౌలింగ్‌లో ఎల్‌బీగా వెనుదిరిగాడు. ఆ వెంటనే ఛటేశ్వర పుజారా, విరాట్ కోహ్లీ తక్కువ పరుగులకే అవుటయ్యారు. ఆ తర్వాత టీమిండియా బ్యాట్స్‌మెన్ నుంచి ఎలాంటి ప్రతిఘటన ఎదురుకాలేదు . చివరకు 71.2 ఓవర్లలో 189 పరుగులకు టీమిండియా అలౌటైంది. ఎనిమిది వికెట్లు తీసిన ల్యాన్ భారత్ నడ్డివిరిచాడు. టీమిండియా బ్యాట్స్‌మెన్లలో రాహుల్ 90 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.


