పుణే టెస్టులో స్టీవ్‌స్మిత్ సెంచరీ
Published on: Sat Feb 25, 2017 10:34AM

రెండంకెల స్కోరు చేయడానికి భారత బ్యాట్స్‌మెన్ నానా తంటాలు పడిన చోట ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ సెంచరీ చేశాడు. పుణేలో భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ సెంచరీతో వీర విహారం చేశాడు..ఓ వైపు సహచరులు పెవలియన్‌కు చేరుతున్నా..సహనం, ఓర్పుగా పరుగులు రాబట్టి జట్టును పటిష్టమైన స్థితిలోకి చేర్చడంతో పాటు శతకాన్ని తన ఖాతాలోకి వేసుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 27 పరుగులే చేసిన స్మిత్ రెండో ఇన్నింగ్స్‌లో చేలరేగిపోయాడు. అనంతరం జడేజా బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూ గా వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 83 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 279 పరుగులు చేసింది. క్రీజులో స్టీవ్ ఓ కీఫ్ 2 పరుగులతోనూ నాథన్ లయన్ 13 పరుగులతో ఉన్నారు.


