కాంగ్రెస్ కే పట్టం కట్టిన ఇండియా టుడే ఎగ్జిట్ పోల్
Published on: Thu Nov 30, 2023 5:42PM
ఇండియా టుడే సీఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్ తెలంగాణలో కాంగ్రెస్ కే పట్టం కట్టింది. ఆ ఎగ్జిట్ పోల్ ప్రకారం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యత సాధించి అధికారాన్ని చేజిక్కించు కుంటుంది.
ఇండియా టుడే ప్రకారం కాంగ్రెస్ 63 నుంచి 79 స్థానాలలో విజయకేతం ఎగరవేసి అధికారాన్ని కైవసం చేసుకుంటుంది. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ 31 నుంచి 47 స్థానాలకు పరిమితమౌతుంది.
ఇక బీజేపీ 5 నుంచి 10 స్థానాలతో సరిపెట్టుకుంటుంది. ఇతరులు 3 నుంచి 8 స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉంది.


