TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బ్రేకింగ్: దేశంలో ఒమిక్రాన్ తో తొలి మరణం

Published on: Fri Dec 31, 2021 9:14AM

ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్ ఒమిక్రాన్ వైరస్ మనదేశంలోనూ పంజా విసురుతోంది. గత వారం రోజులుగా కొత్త వేరియంట్ కేసులు ప్రమాదకరంగా పెరుగుతున్నాయి. అయితే ఒమిక్రాన్ విజృంభిస్తున్నా.. దాని తీవ్రత డెల్టా వేకియంట్ తో పోల్చితే తక్కువగా ఉందని వైద్యులు చెబుతూ వస్తున్నారు. అయితే తాజాగా దేశంలో తొలి ఒమిక్రాన్ మరణం నమోదైంది. 

మహారాష్ట్రలో ఒమిక్రాన్ వైరస్ కారణంగా తొలిసారి ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పింప్రి చిన్వాడ్ ప్రాంతానికి చెందిన 52 ఏళ్ల వ్యక్తి గుండెపోటుతో చనిపోయినట్టు అధికార యంత్రాంగం ప్రకటించింది. అతడికి కరోనా ఒమిక్రాన్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అయితే, అధికారులు మాత్రం అతను ఒమిక్రాన్ కారణంగా చనిపోలేదని, ఇతర అనారోగ్య సమస్యల వల్ల ప్రాణాలు కోల్పోయాడని పేర్కొంటున్నారు.

యశ్వంత్ రావు చవాన్ ఆసుపత్రిలో సదరు బాధితుడు కరోనాకు చికిత్స పొందుతూ ఈ నెల 28న మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. నైజీరియా నుంచి రావడంతో కరోనా బారిన పడ్డాడు. ‘‘రోగికి 13 ఏళ్ల నుంచి మధుమేహం సమస్య ఉంది. అతడు కరోనాయేతర కారణాలతో మరణించాడు. ఒమిక్రాన్ రకం ఇన్ఫెక్షన్ బారినపడినట్టు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ రిపోర్ట్ తెలియజేసింది’’ అని అధికారులు ప్రకటన విడుదల చేశారు.