TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

16 రోజుల తర్వాత తగ్గిన పెట్రోల్‌... ఒక్క పైసానే

Published on: Thu May 31, 2018 11:29AM

 

దేశ ప్రజలని ఇంతకంటే దారుణంగా అపహాస్యం చేయడం కష్టమేమో! 16 రోజుల పాటు పెట్రోలు ధరలతో ప్రజలని బాది పారేసిన కేంద్ర ప్రభుత్వం నిన్న ఒక్క పైసా తగ్గించింది. ముందుగా పెట్రోల్‌ని 60 పైసలు, డీజిల్‌ను 56 పైసలు మేర తగ్గించామని ఇండియన్‌ ఆయిల్‌ సంస్థ పేర్కొంది. ఆ వెంటనే నాలుక కరుచుకొంది. కేవలం ఒకే ఒక్క పైసా తగ్గిస్తున్నట్లు పేర్కొంది. ఈ ప్రకటనతో ప్రతిపక్షాలతో పాటు సోషల్‌ మీడియా కూడా భగ్గుమంది. అటూఇటూ కాకుండా ఈసారి ఏకంగా కేంద్ర ప్రభుత్వాన్నే ట్రోల్‌ చేశారు ప్రజలు. ఈ దెబ్బతో అయినా ప్రజల మనసు ఎలా ఉడికిపోతోందో ప్రభుత్వానికి తెలిస్తే బాగుండు!