పాక్ కు నిద్రపట్టనివ్వని భారతజెండా...
Published on: Tue Mar 7, 2017 1:50PM

మన జాతీయ జెండాను చూసి ప్రత్యర్థ దేశమైన పాకిస్థాన్ కు భయం వేస్తుందంటా. మన జెండా చూస్తే పాకిస్థాన్ కు ఎందుకు భయం అనుకుంటున్నారా..? అసలు సంగతేంటంటే... అమృత్ సర్ సమీపంలోని భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉన్న అటారీ సమీపంలో దాదాపు 360 అడుగుల ఎత్తైన భారతీయ జెండాను ఆవిష్కరించారు. పాక్ లోని లాహోర్ నుంచి చూసినా కూడా ఈ జాతీయ జెండా కనిపిస్తుందట. అందుకే మన జాతీయ జెండాను చూసి పాకిస్థాన్ భయపడిపోతుందట. ఈ జాతీయ జెండా ద్వారా భారత్ ఏదైనా నిఘా నిర్వహిస్తుందేమో అని... జెండా కోసం ఏర్పాటు చేసిన స్తంభంలో నిఘా కెమెరాలు ఏర్పాటు చేశారేమోనని కంటి మీద కునుకు పడటంలేదట. ఇక ఈ విషయం అక్కడ మీడియా కూడా చెప్పడంతో.. దీనిపై స్పందించిన బీఎస్ఎఫ్ అధికారులు.. అలాంటిది ఏం చేయలేదని....పాకిస్థాన్ వ్యాఖ్యలను తిప్పికొట్టింది.


