ప్రపంచబ్యాంకు రుణాల్లో నెంబర్వన్ భారత్
Published on: Fri Oct 19, 2012 9:22AM
.png)
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల్లోకి అత్యధిక రుణాలు పొందిన దేశంగా భారత్‌కు ప్రపంచబ్యాంకు గుర్తింపు ఇచ్చింది. దేశప్రధానిగా పీవి నర్సింహరావు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు ప్రపంచబ్యాంకు రుణాలు తీసుకున్న ప్రముఖుల్లో అగ్రస్థానాల్లో నిలిచారు. అప్పటి పిఎం, సిఎంల ఈ ఖ్యాతి ఇప్పటికీ కొనసాగుతోంది. ఇప్పటికీ దక్షిణాసియా ప్రాంతంలో అప్పుచేయడంలో మన దేశం నెంబర్ వన్ స్థానంలోనే ఉంది. ఒక్క జాతీయ గ్రామీణ నీటి సరఫరా ప్రాజెక్టుకు 500 మిలియన్ యుఎస్ డాలర్లు, వాటర్‌షెడ్ ప్రాజెక్టుకు రూ.250మిలియన్ డాలర్లు ప్రపంచబ్యాంకు నుంచి అప్పుతీసుకున్నాం. ఈ విషయాన్ని ప్రపంచబ్యాంకు సౌత్‌ఆసియా రీజియన్ డైరెక్టర్ జాన్ హెచ్ స్టెయిన్ ధృవీకరించారు.


