భారత్‌కు చేజారిన బాడ్మంటన్ స్వర్ణం
Published on: Wed Aug 3, 2022 10:02AM
కామన్వెల్త్ గేమ్స్ 2022 మిక్స్‌డ్ గ్రూప్ మ్యాచ్‌లో భారత బ్యాడ్మింటన్ జట్టు రజత పతకాన్ని కైవసం చేసుకుంది. కామన్వెల్త్ గేమ్స్‌లో ఒలింపిక్ విజేత పీవీ సింధూతో కూడిన భారత బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ టీమ్ ఫైనల్స్‌లో మలేషియాపై 3-1 తేడాతో ఓడిపోయింది. ఎంతో పోటాపోటీగా జరిగిన బ్యాడ్మింటన్ భారత్ స్టార్లు చిరాగ్ శెట్టి, సాత్విక్ సాయిరాజ్, రంకిరెడ్డి మలేషియా ప్లేయర్లతో ఎంతో పోటీతత్వంతో ఆడినప్పటికీ మలేషియా కొంత ఆధిపత్యం చెలాయించింది.
రెండో మ్యాచ్‌లో మాత్రి భారత్ సూపర్‌స్టార్ పి.వి.సింధు జిన్ వీ గోహ్‌తో తలపడింది. తొలి గేమ్‌లోనే సింధూ దూకుడుగా ఆడి ప్రత్యర్ధిని ఖంగారెత్తించి 22-20 ఆధిక్యత సాధించింది. కాగా మరో స్టార్ కిడాంబి శ్రీకాంత్ ఊహించనివిధంగా మలేషియా స్టార్ ఎన్జీ యోంగ్‌పై మొదటి గేమ్‌లోనే ఓడిపోయి నిరాశపరి చాడు. 21-19, 6-21, 21-16 తేడాతో ఈ మ్యాచ్ మలేషియన్ విజయం సాధించాడు. తర్వాతి మలేషియా జోడీ రెండో గేమ్‌ను 21-17తో గెలిచి 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.


