TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

భారత్ సెమీస్ చేరేనా! కివీస్- ఆఫ్గన్ మ్యాచ్ పైనే ఆశలు..

Published on: Sun Nov 7, 2021 10:19AM

టీట్వంటీ వరల్డ్ కప్ లో భారత్ కు అత్యంత కీలకమైన మ్యాచ్ ఆదివారం జరగబోతోంది. అయితే ఈ మ్యాచ్ లో టీమ్ ఇండియా ఆడటం లేదు. భారత్ సెమీఫైనల్ అవకాశాలను డిసైట్ చేసే గేమ్ జరగబోతోంది. న్యూజీలాండ్, ఆప్ఘనీస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ ఇప్పుడు భారత్ అభిమానులకు అత్యంత కీలకంగా మారింది. ఈ మ్యాచ్ లో కివీస్ ఓడిపోతేనే కోహ్లీసేనకు సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. అందుకే కివీస్ పై ఆప్ఘనీస్తాన్ ఓడిపోవాలని భారత అభిమానులు ప్రార్ధనలు చేస్తున్నారు. 

ఆదివారం జరిగే మ్యాచ్‌ లో ఆఫ్ఘనిస్తాన్‌ గెలిచి.. న్యూజిలాండ్‌ ఓడితే.. ఆ రెండు జట్ల ఖాతాలో 6 పాయింట్లు చొప్పున ఉంటా యి. దీంతో సోమవారం జరిగే మ్యాచ్‌లో భారత జట్టు నమీబియాను చిత్తుగా ఓడిస్తే భారత్‌ ఖాతా లోనూ 6 పాయింట్లు జమ అవుతాయి. దీంతో మెరుగైన రన్‌రేట్‌ కలిగిన ఓ జట్టు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. న్యూజిలాండ్‌-ఆఫ్ఘనిస్తాన్‌ మ్యాచ్‌ అనంతరం మరుసటి రోజు భారతజట్టు పసికూన నమీబియాతో ఆఖరి లీగ్‌ మ్యాచ్‌ ఆడనున్న నేపథ్యంలో మెరుగైన రన్‌రేట్‌కు భారత్‌కు అవకాశం దక్కనుంది. ఒకవేళ అదే జరిగితే ఆఫ్ఘన్‌, న్యూజిలాండ్‌లను భారత్‌ అధిగమించి రెండో స్థానానికి ఎగబాకి సెమీస్‌కు చేరే అవకాశముంది. దీంతో టీమిండియా అభిమానులంతా నేటి మ్యాచ్‌పై దృష్టి పెట్టారు. ఆప్ఘనీస్తాన్ గెలవాలంటూ పూజలు చేస్తున్నారు. 
 
న్యూజిలాండ్‌ ఓడితే ఎదుర్కోనున్న తీవ్ర పరిణామాలను గురించి పాకిస్తాన్‌ మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ తన యు-ట్యూబ్‌ చానల్‌లో వివరించాడు. ''ఆప్ఘన్‌తో పోరులో కివీస్‌ గెలిస్తే ఏ సమస్య ఉండదని.. ఓడిపోతే మాత్రం పాక్‌ అభిమానులు ఊరుకోరన్నాడు. ఒకవేళ అలా జరిగితే మాత్రం టీమిండియా సెమీస్‌కు వెళ్లాలని న్యూజిలాండ్‌ కావాలనే ఓడిపోయిదంటూ పాక్‌ క్రీడాభిమానులు ట్రోల్స్‌ చేయడం ఖాయమని, అలా జరగకూడదంటే ఆఫ్ఘన్‌పై కివీస్‌ విజయం సాధిస్తే సరిపోతుంది'' అంటూ చెప్పుకొచ్చాడు.