TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చైనాకి వెళుతోన్న ఇండియన్ జేమ్స్ బాండ్!

Published on: Wed Jul 26, 2017 6:27PM

 

నేషనల్ సెక్యురిటీ అడ్వైజర్… ఇలాంటి పదవి ఒకటి వుంటుందని కూడా చాలా మందికి తెలియదు నిన్న మొన్నటి వరకూ! కాని, మోదీ గవర్నమెంట్ వచ్చాక అనూహ్యంగా అజిత్ ధోవల్ తెర మీదకు వచ్చారు. ఆయన జాతీయ భద్రతా సలహాదారుగా చక్రం తిప్పుతున్నారని మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. అది నిజం కూడా! మరీ ముఖ్యంగా, పాకిస్తాన్ పై సర్జికల్ స్ట్రైక్స్ సక్సెస్ ధోవల్ దే! ఆయన వ్యూహ రచనతోనే మన ఆర్మీ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోకి ప్రవేశించి శత్రు నాశనం చేసి విజయవంతంగా తిరిగి వచ్చింది!

 

పాకిస్తాన్ విషయంలో తెర వెనుక హీరో అయిన ధోవల్ ఇప్పుడు చైనా విషయంలోనూ కీలకం అవుతున్నారు. మన దేశంలో ఆయన ఇమేజ్ సంగతి ఎలా వున్నా చైనాలో మాత్రం అజిత్ ధోవల్ ఎవరో క్లియర్ గా తెలిసిపోయింది! అక్కడి మీడియా ఈ ఇండియన్ అధికారిని టార్గెట్ చేస్తూ కథనాలు రాస్తోందంటే ధోవల్ సత్తా ఏంటో అర్తం చేసుకోవచ్చు! చైనా లాంటి అతి పెద్ద దేశం భారత్ ప్రధాని గురించి మాట్లాడితే సహజం! అలా కాక రక్షణ మంత్రి, విదేశాంగ శాఖా మంత్రి గురించి మాట్లాడినా అర్తం చేసుకోవచ్చు. కాని, చైనీస్ మీడియా ధోవల్ పై దృష్టి పెట్టిందంటే ఈ సైలెంట్ కిల్లర్ ఎంత మొనగాడో గ్రహించవచ్చు!

 

చైనా వాళ్లు దోవల్ పై దృష్టి సారించటానికి మరో కారణం… ఆయన రేపట్నుంచీ రెండు రోజులు బీజింగ్ సందర్శించటమే! బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారులు చైనా రాజధానిలో సమావేశం అవుతున్నారు. అందులో పాల్గొనటానికి , బ్రెజిల్, రష్యా, సౌత్ ఆఫ్రికా దేశాల అధికారులు వస్తున్నారు. ఈ సందర్భంగా చైనా, భారత్ ఎన్ఎస్ఏల మధ్య డోక్లామ్ సమస్య గురించి చర్చ జరగవచ్చని మీడియా భావిస్తోంది.

 

నిజంగా అజిత్ ధోవల్ చైనా పర్యటనతో డోక్లామ్ సంక్షోభం ఎంత వరకూ తగ్గు ముఖం పడుతుందో చెప్పలేం కాని… ఈ రాటుదేలిన మాజీ రా ఏజెంట్ అంటే డ్రాగన్ కూడా అలెర్ట్ గానే వుంటోంది. ఆయనతో డిస్కషన్ అంటే మోదీతో ఇండైరెక్ట్ గా మాట్లాడటమేనని భావిస్తోంది. చూడాలి మరి… అభిమానులు ఇండియన్ జేమ్స్ బాండ్ అని గర్వంగా పిలుచుకునే ధోవల్ చైనాలో ఏం చేస్తారో!