మరో అడుగు ముందుకేసిన చైనా... ప్రీ ప్లాన్ లో భారత్...

 

భారత్-చైనా మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తేనే మండే పరిస్థితి ఏర్పడింది. డోక్లామ్ ప్రాంత వివాదంలో రెండు దేశాల మధ్య వార్ నడుస్తోంది. చైనా అయితే ఒక అడుగు ముందుకేసి ఓ వార్నింగ్ లు మీద వార్నింగ్ లు ఇచ్చేస్తుంది. భారత్ కూడా ఆ వార్నింగ్ లకు తగిన సమాధానం చెబుతుందనుకోండి... అయితే ఇప్పుడు తాజాగా మరో అడుగు ముందుకేసినట్టు తెలుస్తోంది. డోక్లామ్ ప్రాంతంలోని భారత సైన్యాన్ని ఎలాగైనా తరిమేయాలని నిర్ణయించుకున్న చైనా.. తమ సైన్యానికి కీలక ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. గత నెల రోజులుగా పలు మార్లు హెచ్చరికలు పంపినా, ఇండియా వినట్లేదని ఆరోపిస్తూ, పరిమితంగా సైనిక చర్యలు చేపట్టాలని ఆ ప్రాంతంలో మోహరించిన తమ జవాన్లకు చైనా ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందినట్టు సమాచారం.

 

మరోవైపు భారత్ కూడా మాటలతో కాదు చేతలతోనే చైనాకు సమాధానం చెప్పాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే డొక్లాంలో భారీగా బలగాలను మోహరించాలని ఆదేశాలు జారీ అయినట్టు తెలుస్తోంది. ఈశాన్య రాష్ట్రాల్లో భారత వాయుదళానికి కూడా ఆపరేషనల్‌ అలర్ట్‌ జారీ అయిందని సమాచారం. ఏ సమయంలోనైనా చైనా దుశ్చర్యకు పాల్పడే అవకాశం ఉందని భారత్‌ నమ్ముతోంది. అందుకే ఉన్న పళంగా 3,488 కిలోమీటర్ల సరిహద్దులోని భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉండాలని జారీ చేసిన అలర్ట్‌లో పేర్కొంది.