TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

భారత్ ను దెబ్బతీయడానికి చైనా కొత్త ప్లాన్...

Published on: Thu Mar 9, 2017 9:43AM


భారత్ కు చైనా ఎప్పుడూ పక్కలో బల్లెంలా ఉంటుందన్న సంగతి తెలసిందే. ఎప్పుడూ భారత్ కు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తుంటుంది. ఇప్పుడు తాజాగా మరో ప్లాన్ వేసే పనిలో పడింది చైనా. అదేంటంటే.. బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) దేశాల కూటమి స్థానంలో 'బ్రిక్స్ ప్లస్' పేరిట మరిన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలను కలిపి, ఓ కూటమిని ఏర్పాటు చేయాలన్నది చైనా ఆలోచన. బ్రిక్స్ ద్వారా ఇప్పటి వరకూ ఇండియాలో పలు అభివృ్ధి కార్యక్రమాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు చైనా బ్రిక్స్ ప్లస్ కూటమిని ఏర్పాటు చేస్తే... ఇండియాకు నష్టమని.. ఇండియాకు నిధుల కొరత ఏర్పడుతుందని నిపుణులు అంటున్నారు. అయితే బ్రిక్స్ ప్లస్ కూటమి ఏర్పాటు చేయాలంటే భారత్ అనుమతి తప్పనిసరి కావాల్సిందే. ఈ నేపథ్యంలో భారత్ అనుమతి ఇవ్వకపోవచ్చు అంటున్నారు. అంతేకాదు భారత్ కు కూడా ఈ కూటమికి అంగీకరించదని చైనా కూడా భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ చైనా చేరదీయాలనుకుంటున్న దేశాలు ఏంటనుకుంటున్నారా...? పాకిస్థాన్, శ్రీలంకలతో పాటు మెక్సికో. తమకు మిత్రులుగా ఉన్న దేశాలను కలుపుకొని భారత్ ను దెబ్బతీయాలనుకుంటున్న చైనా ప్లాన్ వర్కవుట్ అవుతుందో? లేదో.. ?చూద్దాం.