పాకిస్థాన్‌తో మాటల్లేవ్...
Published on: Tue Aug 19, 2014 3:37PM

ఈనెల 25న భారత్, పాకిస్థాన్‌ల మధ్య విదేశాంగ శాఖ కార్యదర్శుల స్థాయి చర్చలు జరుగనున్నాయి. అయితే కాశ్మీర్ వేర్పాటువాద హురియత్ నేతలతో భారత్‌లోని పాకిస్థాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ సంప్రదింపులు జరపడం ఈ చర్చలకు విఘాతం కలిగించింది. హురియత్ నేతలతో పాకిస్థాన్ సంప్రదింపులు జరపడం మీద భారత్ సీరియస్ అయింది. దాంతో పాకిస్థాన్‌తో జరగనున్న విదేశాంగశాఖ కార్యదర్శుల స్థాయి చర్చల నుంచి విరమించుకుంటున్నట్లు తేల్చి చెప్పింది. మీకు ఇండియాతో స్నేహం కావాలా? వేర్పాటువాదులతో అనుబంధం కావాలా అని భారత విదేశాంగ కార్యదర్శి సుజాతాసింగ్ పాకిస్థాన్ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్‌కి ఫోన్ చేసి అడిగినప్పటికీ ఆయన హురియత్ నేత షబ్బీర్ షాతో సమావేశమయ్యారు. భారత్‌లోని పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ వేర్పాటువాదులతో సమావేశం కావడం రెచ్చగొట్టే చర్యేనని రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు.


