చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్

Publish Date:Jun 21, 2013

 

 India beat Sri Lanka by 8 wickets, India beat Sri Lanka, India  Champions Trophy final

 

 

ఇంగ్లాండ్ లో జరుగుతున్న చాంపియన్స్ ట్రోఫీలో ఇండియా జోరు కొనసాగుతుంది. కీలక సెమీస్ లో కూడా తబడకుండా లక్ష్యాన్ని అవలీలగా చేధించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా బౌలర్లు విజృంభించారు. బంతి చేతపట్టిన ధోనీతో సహా ప్రతి ఒక్కరూ లంక బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు. భువీ తన రెండో ఓవర్లోనే కుశాల్ పెరెరా 4ను అవుట్ చేశాడు. పెరెరా సెకండ్ స్లిప్‌లో రైనాకు దొరికిపోయాడు. ఐదో ఓవర్లో దిల్షాన్ రిటైర్ట్ హర్ట్‌గా వెనుదిరిగాడు. భువీతో పాటు ఉమేష్ పొదుపుగా బౌలింగ్ చేయడంతో లంకేయులు పరుగులు చేయడానికి చెమటోడ్చారు. 15 ఓవర్లలో లంక స్కోరు 36/1 మాత్రమే. ఈ దశలో ఇషాంత్ వరుస ఓవర్లలో తిరుమన్నె 7, సంగక్కర 17ను పెవిలియన్ చేర్చి లంకను మరింత కష్టాల్లోకి నెట్టాడు. వీరిద్దరూ సెకండ్ స్లిప్‌లో రైనాకు క్యాచిచ్చారు. ఆ తర్వాత లంకేయులు కోలుకోలేకపోయారు.


182 పరుగుల కష్టసాధ్యంకాని లక్ష్యాన్ని భారత్ కేవలం రెండు వికెట్లకు మరో 90 బంతులు మిగిలుండగానే అవలీలగా ఛేదించింది. సూపర్ ఫామ్‌లో ఉన్న ఓపెనర్ ధవన్ 68.. రోహిత్ 33తో 77 పరుగులు, కోహ్లీతో 58 నాటౌట్తో రెండో వికెట్‌కు 65 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి విజయానికి మార్గం సుగమం చేశాడు. చివర్లో ధవన్ వెనుదిరిగినా విరాట్, రైనా 7 నాటౌట్ లాంఛనం పూర్తి చేశారు.