చాంపియన్స్ ట్రోఫీ: ఆసీస్ 65 ఆలౌట్

 

 

India beat Australia by 243 runs, India beat Australia , Champions Trophy 2013,  India Champions Trophy 2013

 

 

ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ప్రాక్టీస్ మ్యాచ్‌ లలో ఇండియా అదరగొట్టింది. మొన్న శ్రీలంకపై భారీ స్కోరును చేజింగ్ చేయగా, నిన్న ఆస్ట్రేలియా ను 65 పరుగులకే ఆలౌట్ చేసింది. ఆస్ట్రేలియా తో జరిగిన రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో 55 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును దినేశ్ కార్తీక్ 140 బంతుల్లో 17 ఫోర్లు, సిక్స్‌తో 146 నాటౌట్ శతక్కొట్టుడుకు తోడు ధోనీ 77 బంతుల్లో 6 ఫోర్లు 4 సిక్సర్లతో 91 మెరుపులతో 50 ఓవర్లలో 6 వికెట్లకు 308 పరుగులు చేసింది. వరుసగా రెండో సెంచరీతో కార్తీక్ భారత్ ను ఆదుకున్నాడు. సెంచరీ మిస్ చేసుకున్న ధోనీతో కలిసి ఆరో వికెట్‌కు 211 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. 309 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దీగిన ఆస్ట్రేలియా ను ఇండియా బౌలర్లు కంగారు పెట్టించారు. ఉమేశ్.. వరుసగా ఐదు వికెట్లు పడగొట్టడంతో.. కంగారూల బ్యాటింగ్ లైనప్ కుప్పకూలిపోయింది. ఆ తర్వాత ఇషాంత్ వరుసగా మూడు వికెట్లు తీయడంతో ఆసీస్ కోలుకోలేకపోయింది. వోగ్స్ (23) ఒంటరి పోరాటానికి అశ్విన్ ముగింపు పలకడంతో ఆస్ట్రేలియా కేవలం 65 పరుగులకే చాప చుట్టేసింది.