ఇండియా ఆలౌట్.. 332 పరుగులు..
Published on: Mon Mar 27, 2017 11:56AM
(1)(1)(2).jpg)
ధర్మశాల వేదికగా టీమిండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈమ్యాచ్లో భాగంగా మూడో రోజు బ్యాటింగ్ కు దిగిన ఇండియా... 332 పరుగులకు ఆలౌటైంది. నిన్న 248/6 ఓవర్‌నైట్ స్కోరుతో ఈరోజు ఆటను ప్రారంభించగా.. ఆసీస్ బౌలర్ల దాటిని ఎదుర్కోలేక వరుసగా పెవిలియన్ చేరుకున్నారు. దీంతో 14 పరుగుల తేడాలో చివరి నాలుగు వికెట్లు పడిపోయాయి. తర్వాత వచ్చిన భువనేశ్వర్ డకౌట్ కాగా సాహా (31) కూడా కమిన్స్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. ఆసీస్ బౌలర్లలో లయన్ ఐదు, కమిన్స్ 3, హేజిల్ వుడ్, ఓకీఫ్ చెరొక వికెట్ తీసుకున్నారు.


