ముగిసిన ఆసీస్ ఇన్నింగ్స్...టీమిండియాదే పైచేయి.

 

టీమిండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య ధర్మశాల వేదికగా ఆఖరి టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ఆసీస్ బ్యాటింగ్ ను ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ తొలి సెషన్ లో బాగానే స్కోర్ చేసింది. ఒకటి రెండు సార్లు తడబడ్డా అద్బుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంది. ఇక ఓపెనర్ గా దిగిన కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఈసారి కూడా సెంచరీ చేసి భారీ స్కోరే అందించాడు. వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ (56) రాణిస్తున్న సమయంలో కుల్ దీప్ యాదవ్, వార్నర్ ను పెవిలియన్ కు పంపాడు. అనంతరం స్మిత్ కు జత కలిసిన షాన్ మార్ష్ (8) ను ఉమేష్ యాదవ్ బోల్తా కొట్టించాడు. తరువాత క్రీజులోకి వచ్చిన మ్యాక్స్ వెల్ (8) ను మరో అద్భుత బంతితో పెవిలియన్ కు పంపాడు. అనంతరం సెంచరీతో కదం తొక్కిన స్మిత్ (111) ను అశ్విన్ అవుట్ చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఆ తరువాత వచ్చిన కుమ్మిన్స్ (21)ను కుల్ దీప్ యాదవ్ అవుట్ చేశాడు. ఆ తరువాత ఒకీఫ్ (8)ను సబ్ స్టిట్యూట్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ విసిరిన బంతితో కీపర్ సాహా రన్ అవుట్ చేశాడు. దీంతో  మొత్తం 88.3 ఓవర్లు ఆడిన ఆస్ట్రేలియా జట్టు 300 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ను ముగించింది. కాగా కుల్ దీప్ యాదవ్ నాలుగు వికెట్లతో రాణించగా, రెండు వికెట్లతో ఉమేష్ యాదవ్ ఆకట్టుకున్నాడు. అశ్విన్, జడేజా, భువనేశ్వర్ కుమార్ చెరొక వికెట్ తీశారు. దీంతో టీమిండియా బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెనర్లు మురళీ విజయ్, కేఎల్ రాహుల్ భారత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించారు.