మూడోరోజు లంచ్ టైం.. భారత్ 193/2
Published on: Sat Mar 18, 2017 12:45PM
.jpg)
రాంచీలో భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. మూడో రోజు జరుగుతున్న మ్యాచ్ లో లంచ్ విరామానికి భారత్ రెండు వికెట్ల కోల్పోయి 193పరుగులు సాధించింది. 120/1 ఓవర్‌నైట్ స్కోరుతో భారత్ మూడో రోజు ఆటను ప్రారంభించగా.. తొలి సెషన్‌లో 30.4ఓవర్లు ఆడిన భారత్ వికెట్ నష్టానికి 73పరుగులు చేసింది. కాగా ఆసీస్‌పై తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఇంకా 258పరుగుల వెనుకంజలో ఉంది.


