TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

25 సార్లు 5 వికెట్లు..రికార్డ్ సాధించిన అశ్విన్..

Published on: Tue Mar 7, 2017 2:51PM

 

టెస్ట్ మ్యాచ్ సీరీసుల్లో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇప్పటికే ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. నేడు బెంగుళూరులో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో కూడా అశ్విన్ మరో రికార్డ్ ను సాధించాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో వేదికగా జరిగిన మ్యాచ్ లో 8 వికెట్లు తీశాడు. రెండో ఇన్నింగ్స్ లో 6 వికెట్లు తీయడంతో అశ్విన్ వేగంగా 5 వికెట్లు సాధించిన ఆటగాళ్లలో టాప్ లో నిలిచాడు. అంతేకాదు తక్కువ పరుగులిచ్చి 5 వికెట్ల ఘనత సాధించిన ఆటగాడిగా.. ఇంకా 25 సార్లు 5 వికెట్ల ఘనతసాధించిన ఆటగాడిగా అశ్విన్ నిలిచాడు.